Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని

హీరో నాని నటిస్తోన్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hai Nanna).  దీని ప్రమోషన్స్‌లో నాని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 23 Sep 2023 11:41 IST

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని (Nani) తాను మొదటిసారి ప్రేమలో ఎప్పుడు పడ్డారో చెప్పారు. అలాగే ప్రస్తుతం తన క్రష్‌ ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’..ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రేడియో జాకీలతో (RJ) కలిసి చిట్‌చాట్‌ నిర్వహించారు.

‘‘ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. కానీ, నేను ప్రేమలో పడింది మాత్రం మూడో తరగతిలోనే. అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీల్లో సోనీ అనే అమ్మాయి మంచి గౌను వేసుకుని వచ్చింది. నేనేమో ఆకులు చుట్టుకుని నిలబడ్డాను. ఇప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే.. ప్రస్తుతం నేనూ మంచి డ్రెస్‌ వేసుకున్నా కాబట్టి వెళ్లి తనని పలకరిస్తాను’’ అని సరదాగా చెప్పారు. అలాగే ప్రజెంట్‌ తన క్రష్‌ గురించి మాట్లాడుతూ కియారా ఖన్నా (హాయ్‌ నాన్న చైల్డ్‌ ఆర్టిస్టు) అంటే ఎంతో ఇష్టమని అన్నారు. ‘ఒకరోజు కియారా ఖన్నా చక్కగా రెడీ అయి సెట్‌కు వచ్చింది. భలే ముచ్చటగా అనిపించింది. నేను కనుక తన వయసులో ఉంటే తనపై మనసు పారేసుకునే వాడిని. కాబట్టి ప్రస్తుతం నా క్రష్‌ ఆ పాపనే’ అని చెప్పారు. 

రజనీకాంత్‌ ‘జైలర్‌’ కథను మరోలా చూపించవచ్చు: పరుచూరి విశ్లేషణ

ఇక ‘హాయ్‌ నాన్న’ (Hai Nanna) విషయానికొస్తే..  శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కిస్తున్నారు. మృణాల్ ఠాకూర్‌ కథానాయిక. ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇదే పేరుతో రానుండగా.. హిందీలో మాత్రం ‘హాయ్‌ పాపా’ పేరుతో విడుదల కానుంది. తండ్రీకూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. వినూత్నమైన కథాంశంతో పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల విడుదల చేసిన పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని