Rakul Preet Singh: పెళ్లి ముచ్చట్లు

సినీ తారల పెళ్లి... పిల్లల ముచ్చట్లు ఈమధ్య బాగా వినిపిస్తున్నాయి. కరోనా తర్వాత చాలా మంది తమ వ్యక్తిగత జీవితాల్లోకి తోడుని ఆహ్వానించారు. ఆ తర్వాత పిల్లల్ని  కన్నారు. కొద్దిమందేమో పెళ్లి చేసుకోకుండా ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

Updated : 14 Oct 2022 07:11 IST

సినీ తారల పెళ్లి... పిల్లల ముచ్చట్లు ఈమధ్య బాగా వినిపిస్తున్నాయి. కరోనా తర్వాత చాలా మంది తమ వ్యక్తిగత జీవితాల్లోకి తోడుని ఆహ్వానించారు. ఆ తర్వాత పిల్లల్ని  కన్నారు. కొద్దిమందేమో పెళ్లి చేసుకోకుండా ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో రెండు జంటలకి సంబంధించిన పెళ్లి కబుర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కియారా అడ్వాణీ (Kiara Advani) - సిద్ధార్థ్‌ మల్హోత్రా (Sidharth Malhotra) ఒక జంట కాగా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) - జాకీ భగ్నానీ (Jackky Bhagnani) జంట మరొకటి. ప్రేమలో ఉన్న ఈ జంటలు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాయనేది బాలీవుడ్‌ వర్గాల మాట. రకుల్‌ పెళ్లి తేదీ ఖరారైందనే ప్రచారం కూడా ఊపందుకుంది. ప్రేమ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా ప్రకటించిన రకుల్‌, పెళ్లి ప్రచారానికి మాత్రం చెక్‌ పెట్టింది. నాకు తెలియకుండా నా పెళ్లి తేదీ ఖరారు కావడమా అంటూ  సామాజిక మాధ్యమాల్లోనే ఆ ప్రచారాన్ని ఖండించింది. కియారా అడ్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా జోడీ వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కనుందని ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ ఇటీవల ఓ టాక్‌షోలో తమ మధ్య బంధం స్నేహం కంటే ఎక్కువ అని కియారా చెప్పుకొచ్చింది. కెరీర్‌ పరంగా దూసుకెళుతున్న ఈ ఇద్దరూ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నారని, అందుకోసం ఏర్పాట్లు కూడా ఊపందుకున్నాయని ప్రచారం సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని