Kohli Biopic: కోహ్లీ బయోపిక్‌.. హీరో ఎవరైతే బాగుంటుందో చెప్పిన రణ్‌బీర్‌

విరాట్‌ కోహ్లీ బయోపిక్‌లో హీరోగా ఎవరు నటిస్తే బాగుంటుందో బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) చెప్పారు. అలాగే తనకు కోహ్లీ అంటే ఎంతో ఇష్టమన్నారు.

Published : 16 Nov 2023 10:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ 2023 తొలి సెమీ ఫైనల్‌లో కోహ్లీ (Virat Kohli) తన ఆటతో రికార్డులు బద్దలు కొట్టారు. దీంతో అతడి బయోపిక్‌ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిలో హీరోగా ఎవరు నటిస్తే బాగుంటుందో బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌  చెప్పారు. ముంబయిలో జరిగిన మ్యాచ్‌కు రణ్‌బీర్‌ హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. తన సినిమా ‘యానిమల్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన రణ్‌బీర్‌.. కోహ్లీ బయోపిక్‌ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ బయోపిక్‌లో మీరు నటించాలనుకొంటున్నారా? అనే ప్రశ్నకు రణ్‌బీర్‌ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ‘విరాట్ కోహ్లీ జీవితాన్ని సినిమాగా తీస్తే.. అందులో అతడే నటించాలి. ఎందుకంటే అతడు చాలామంది నటుల కంటే అందంగా కనిపిస్తాడు. అలాగే ఫిట్‌గా కూడా ఉంటాడు. అందుకే ఆ పాత్రను కోహ్లీనే పోషించాలి’’ అని రణ్‌బీర్‌ అన్నారు. 

గౌతమ్‌ మేనన్‌ సూపర్‌ ప్లాన్‌.. సచిన్‌ - వినోద్‌ కాంబ్లిపై సినిమా..!

ఇక కోహ్లీ బయోపిక్‌ గురించి వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు.. ఈ బ్యాటింగ్‌ మ్యాస్ట్రోపై బాలీవుడ్‌ బడా నిర్మాణ సంస్థ సినిమా తీయనుందంటూ గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాదు, అందులో టాలీవుడ్‌ హీరో రామ్ చరణ్‌ నటించనున్నాడని కూడా అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై అప్పుడు రామ్‌ చరణ్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ నాకు చాలా ఇష్టమైన క్రికెటర్‌. అతడు ఎంతో మందికి స్ఫూర్తి. నాకు తన పాత్ర పోషించే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తా. అది అద్భుతంగా ఉంటుంది’’ అంటూ తన కోరికను బయటపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని