Naga Vamsi: ‘గుంటూరు కారం’.. ఆ విషయం ముందే చెప్పాల్సింది: నాగవంశీ

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్ర నిర్మాత నాగవంశీ (Naga Vamsi) తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.

Published : 19 Jan 2024 14:39 IST

హైదరాబాద్‌: ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) కలెక్షన్స్‌ విషయంలో ఆనందం వ్యక్తం చేశారు చిత్ర నిర్మాత నాగవంశీ (Naga Vamsi). తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ‘‘మా సినిమా విడుదలై వారం రోజులైంది. ఫస్ట్‌ వీక్‌ కలెక్షన్స్‌ బాగా వచ్చాయి. బయ్యర్స్ బ్రేక్‌ ఈవెన్‌ దగ్గర్లోకి వచ్చేశారు. నాకు తెలిసినంత వరకూ రివ్యూలు మా సినిమాపై ప్రభావం చూపించలేదు. ప్రీమియర్‌ షోస్‌ అనంతరం ఆన్‌లైన్‌లో జరిగిన హంగామా వల్ల ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఫస్ట్‌ షో తర్వాత పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ మా చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. తల్లీ-కొడుకుల సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యింది. అందుకే మంచి రెవెన్యూ వచ్చింది’’

Eagle: ‘ఈగల్’ రిలీజ్ డేట్.. ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆశ్రయించిన నిర్మాణ సంస్థ

‘‘మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబోలో సినిమా అనేసరికి ఇదొక మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని పలువురు భావించారు. అందువల్ల ప్రీమియర్‌ షోస్‌కు వచ్చిన ప్రేక్షకులు కాస్త నిరాశకు గురయ్యారు. దానివల్లే నెగెటివిటీ వచ్చిందనుకుంటున్నా. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనే విషయాన్ని రిలీజ్‌కు ముందు మేము సరిగ్గా చెప్పలేకపోయాం. అందుకు మాకు సమయం లేకుండా పోయింది. అలా, చెప్పి ఉంటే బాగుండేదనిపించింది. జనవరి 5వ తేదీ వరకూ పోస్ట్‌ ప్రొడక్షన్‌లోనే ఉన్నాం. హైదరాబాద్‌లో ఈవెంట్‌ పెట్టాలని ప్లాన్‌ చేశాం. కొన్ని కారణాల వల్ల గుంటూరుకు షిఫ్ట్‌ చేశాం. ఇలా సమయం ఎక్కువ పట్టేసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు 1AM షోస్‌ వేసి తప్పు చేశానని అనుకుంటున్నా’’

‘‘ప్రీమియర్స్‌ అనంతరం వచ్చిన రివ్యూలు చూసి షాకయ్యా. కానీ, మహేశ్‌ బాబు స్ట్రాంగ్‌గా ఉన్నారు. సెకండ్‌ డే నుంచి రివ్యూలు మారతాయని ఆయన బాగా నమ్మారు. ఆయన చెప్పినట్టే జరిగింది. ఇది వన్‌ మ్యాన్‌ షో కాదు. టూ మ్యాన్‌ షో. త్వరలోనే మేము గ్రాండ్‌ సక్సెస్‌ పార్టీ నిర్వహించాలని అనుకుంటున్నాం’’  అని నాగవంశీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని