Nagarjuna: ‘ది ఘోస్ట్‌’ చిత్రంలో హీరోయిన్‌ ఎవరో..?

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్‌ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా సోనాల్‌ చౌహాన్‌ ఈ సినిమాలో

Updated : 22 Dec 2021 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్‌ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా సోనాల్‌ చౌహాన్‌ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్‌ అగర్వాల్‌ను చిత్రబృందం తొలుత ఎంపిక చేసింది. ఇందులో హీరోయిన్‌ ఒక గూఢచారి. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించాల్సి ఉంటుంది. ఈ మేరకు కాజల్‌తో కొన్ని సన్నివేశాలను సైతం చిత్రీకరించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకొంది. దీంతో అమలాపాల్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత.. సినిమా నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. దీంతో మళ్లీ హీరోయిన్‌ వేటలో పడింది చిత్రబృందం. ఇటీవల మోహ్రీన్‌ను సంప్రదించగా.. భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్‌ చేసిందట. ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆమెను ఎంపిక చేయలేదు. తాజాగా ఈ ప్రాజెక్టులోకి సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున మాజీ రా అధికారిగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని