Uunchai: స్నేహం కోసం మిత్రుల సాహసం

అమితాబ్‌ బచ్చన్‌, అనుపమ్‌ఖేర్‌, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఊంఛాయీ’. పరిణీతి చోప్రా, నీనా గుప్తా, సారిక కీలక భూమికలు పోషించారు.

Updated : 19 Oct 2022 14:28 IST

మితాబ్‌ బచ్చన్‌, అనుపమ్‌ఖేర్‌, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఊంఛాయీ’. పరిణీతి చోప్రా, నీనా గుప్తా, సారిక కీలక భూమికలు పోషించారు. ‘మైనే ప్యార్‌ కియా’, ‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’, ‘ప్రేమ్‌రతన్‌ ధన్‌ పాయో’ సినిమాల దర్శకుడు సూరజ్‌ బర్జాత్యా తెరకెక్కిస్తున్నారు. అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది. మూడు నిమిషాల ఈ వీడియోలో వయసు మళ్లిన ముగ్గురు స్నేహితుల మధ్య అల్లుకున్న స్నేహం గొప్పతనం వివరించే ప్రయత్నం చేశారు. ఒక మిత్రుడి మరణంతో అతడి చివరి కోరికగా విలాసాల జీవితం వదిలి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలనుకుంటారు ఈ ముగ్గురు. ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లు.. లక్ష్యాన్ని చేరుకోవడం.. పాత్రల మధ్య పండిన సెంటిమెంట్‌ ఆసక్తికరంగా చూపించారు. ఈ ట్రైలర్‌ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘స్నేహమే వాళ్లకు సర్వస్వం. దానికోసం ఏమైనా చేస్తారు. నగరాన్ని వదిలి హిమాలయాల బాట పట్టి వాళ్లు చేసిన అరుదైన సాహసయాత్రే ఈ కథ’ అంటూ వ్యాఖ్యానించింది నిర్మాణసంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని