Venkatesh: ఘనంగా వెంకటేశ్‌ కుమార్తె వివాహం

ప్రముఖ నటుడు వెంకటేశ్‌ కుమార్తె హయవాహిని, నిశాంత్‌ల వివాహం ఘనంగా జరిగింది.

Updated : 18 Mar 2024 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ (Venkatesh) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయవాహిని (Hayavahini)తో విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడు నిశాంత్‌తో (Nishanth) వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.   

గతేడాది అక్టోబర్‌లో నిశాంత్‌, హయవాహినిల నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకకు చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. వెంకటేశ్‌, నీరజ దంపతులకు నలుగురు సంతానం. ఆశ్రిత, హయవాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి 2019లో జరిగింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు