
‘భావాలను యథాతథంగా మాతృభాషలోనే చెప్పగలం’
అమెరికాలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రతినిధి కోమటి జయరాం
ఇంటర్నెట్‌డెస్క్: తేనెలొలుకు తెలుగుని మనకు మరింత దగ్గర చేసిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి అని అమెరికాలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. సంస్కృతంతో మిళితమై గ్రాంథికంగా ఉండిపోయిన తెలుగును మదించి వ్యావహారిక భాషలోకి సరళీకరించారని చెప్పారు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా జరుపుకొంటున్న తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోమటి జయరాం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘మన మాతృభాష 56 అక్షరాల తెలుగు కావడం మన అదృష్టం. మనం ఎన్ని భాషలు నేర్చినా.. భావాలను యథాతథంగా కేవలం మాతృభాషలోనే చెప్పగలం. అందుకే మన పిల్లలకు మాతృభాషను నేర్పుదాం.. నేర్చుకునేలా ప్రోత్సహిద్దాం. మనం ఏ దేశానికి వెళ్లినా తెలుగును మరువకూడదు.
నేటివ్ స్పీకర్స్ పరంగా ప్రపంచ భాషల్లో తెలుగుది 11వ స్థానం. భారత్‌లోని 6 క్లాసికల్ లాంగ్వేజెస్‌లో తెలుగు ఒకటి. దేశంలో నాలుగో అతిపెద్ద భాష కూడా మనదే. అమెరికాలో వేగంగా పెరుగుతున్న భాషగా తెలుగు విస్తరిస్తోంది.
తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడడం నేర్చుకొని తెలుగుదనాన్ని ముందుకు తీసుకెళదాం. తెలుగు భాషాసంపదను భవిష్యత్ తరాలకు అందజేద్దాం’’ అని కోమటి జయరాం పిలుపునిచ్చారు.
తెలుగు భాషా దినోత్సవం రోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగు తల్లి విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేయకపోవడంపై కోమటి జయరాం విచారం వ్యక్తం చేశారు. తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు తల్లిని తెలుగు వారే అవమానించుకుంటే ఎలా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఏనాడూ ఇలా జరగలేదన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sita Ramam: ఇట్లు.. నీ భార్య సీతామహాలక్ష్మీ.. హృద్యంగా ‘సీతారామం’ టీజర్
-
Politics News
Andhra News: ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్లు... తెదేపా అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
-
Business News
BSNL: బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటున్నారా?ఈ BSNL ప్యాక్‌పై లుక్కేయాల్సిందే!
-
World News
Padma Bridge: బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!
-
Politics News
Eknath Shinde: శిందే వర్గం పార్టీ పెట్టనుందా..? పేరు అదేనా..?
-
General News
Jamun Health Benefits: నేరేడు పండు తింటున్నారా?ప్రయోజనాలివే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు