కూటమిని గెలిపిద్దాం.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం: ఎన్‌ఆర్‌ఐల తీర్మానం

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు ఆదివారం సమావేశమయ్యారు.

Updated : 19 Mar 2024 22:44 IST

బే ఏరియా: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు ఆదివారం సమావేశమయ్యారు. దాదాపు 100 మంది ముఖ్యులు హాజరై మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో మాదిరిగా కూటమి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

‘‘ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య ప్రజల సున్నిత సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా సేకరించి, ఆ డేటాను తప్పుదారి పట్టించేలా చేస్తున్నారు. ప్రశ్నిస్తే నియంతలా మారి అధికార బలంతో వేధిస్తున్నారు. ఇలాంటి పాలకులను ఇంటికి పంపించకపోతే సొంత రాష్ట్రానికి కూడా వెళ్లలేని పరిస్థితి వస్తుంది. జగన్‌ నియంతలా మారారు. ఇప్పటికే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయింది. ఇంకోసారి ఈ ప్రభుత్వం వస్తే మనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ని మర్చిపోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున మనందరం ఇంకా బలంగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. మన వంతు ఆర్థిక సాయాన్ని జనసేన, తెలుగుదేశం కూటమికి అందించడంతో పాటు క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రచారం చేయాలి. అందుకు అవసరమైన వనరులు మనమే సమకూర్చుకుందాం’’ అని ఎన్‌ఆర్‌ఐలు తీర్మానించుకున్నారు.

తణుకు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ, నందిగామ అభ్యర్థి తంగిరాల సౌమ్య, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ జూమ్ కాల్‌లో పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. జన సైనికులు పొత్తు ధర్మం పాటించి 175 నియోజకవర్గాల్లో‌ తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి పనిచేసి అఖండ మెజారిటీ సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం కరతాళధ్వనులతో మారుమ్రోగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్నారై సభ్యులు జయరాం కోమటి, వెంకట్ కోగంటి, భక్త బల్ల, శ్రీనివాస్ దేవల్ల, ఎంవీ రావు, నరహరి మర్నేని, హరి బాబు బొప్పుడి, సందీప్ ఇంటూరి, సత్య పోలవరపు, జనసేనకి చెందిన వేణు అనుగంటి, తులసీరాం రావూరి, రామ్ చుండూరి, శ్రీనివాస్ చిమట, రెడ్డయ్య ప్రత్తిపాటి, అనిల్ అరిగే, సునీల్ పసుపులేటి, దుర్గ పెద్దిరెడ్డి, శంకర్ అడాబా, చంద్ర పట్టివాడు, సత్య పుట్ట, నారాయణ మట్టిగంట, రమేష్ రాగినేని, కిషోర్ కుమార్, నిరంజన్, రమణ అనుగంటి, తెలుగుదేశం-జనసేన- భాజపా అభిమానులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని