NRI: ఆస్టిన్‌ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు

అమెరికాలోని ఆస్టిన్ నగరంలో తెలుగు కల్చరల్  అసోసియేషన్ (టీసిఏ) నూతన కార్యవర్గం ఏర్పాటైంది.

Published : 12 Feb 2023 22:28 IST

ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో తెలుగు కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. బ్రశీ క్రీక్ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అర్జున్ అనంతుల, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా పరమేష్ రెడ్డి నంగీ, కార్యదర్శిగా శివ దుర్భాకుల, కోశాధికారిగా మధుకర్ రెడ్డి గంగాడి నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా  శైలజ కోమటి (కల్చరల్), జగన్ మల్కారెడ్డి (ఫైనాన్స్ & స్పాన్సర్షిప్), భరత్ పిస్సాయ్ (మెంబర్షిప్), గోపాల కృష్ణ అయితాబత్తుల (ఫుడ్ & లాజిస్టిక్స్),  చిన్నప్ప కుందూరు (స్పోర్ట్స్), బోర్డు అఫ్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ బత్తుల నియమితులయ్యారు. బోర్డు అఫ్ డైరెక్టర్‌లుగా కొనసాగుతున్న రామ్ హనుమంతు, మురళీధర్ వేలూరికి నూతన సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని