TDP: గల్ఫ్‌ దేశాల్లో.. ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెదేపా గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, ఒమాన్, కతర్, బహరేన్ దేశాల్లో కేకులు కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు.

Published : 22 Apr 2023 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెదేపా (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జన్మదిన వేడుకలను పార్టీ గల్ఫ్ కౌన్సిల్ (TDP Gulf Council) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, ఒమన్, ఖతర్, బహ్రెయిన్‌ దేశాల్లో తెలుగుదేశం నేతలు పార్టీ శ్రేణులతో కలిసి కేకులు కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ పార్టీ ప్రతినిధులంతా వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. ప్రవాస భారతీయులు తెదేపా అభివృద్ధికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో చర్చించారు. గల్ఫ్ దేశాల్లో పార్టీ శ్రేణులంతా ఒకతాటిపై నిలిచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై పలువురు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని