COTA - Ugadi: ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..

COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 

Published : 27 Apr 2024 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కంట్రీ ఆఫ్‌ తెలుగు అసోసియేషన్‌ (COTA ) ఆధ్వర్యంలో ఇటీవల ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విలెన్ హాల్ సోషల్ క్లబ్, కొవెంట్రీ వెన్యూలో COTA తొమ్మిదో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. కొవెంట్రీ, మిడ్‌లాండ్స్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా సభ్యులు హాజరయ్యారు.

ఆరు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమంలో ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, సన్మానాలు, రిటర్న్ గిఫ్ట్స్, ఆటలు, పాటలు, డ్యాన్స్, డీజే, విందు భోజనం తదితర కార్యక్రమాలు జరిగాయి. 1957 -2024  వరకు తెలుగు చలన చిత్రాల టైమ్‌ మెషీన్‌ అనే కాన్సెప్ట్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.

COTA  సభ్యులు మాట్లాడుతూ  “తెలుగు వారందరినీ ఒక తాటి పైకి తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో ఈ అసోసియేషన్‌ను స్థాపించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పిన సభ్యులు... ఈ సందర్భంగా ప్రతి ఒక్క తెలుగు కుటుంబానికి శుభాభినందనలు తెలిపారు.

సన్మాన  కార్యక్రమంలో భాగంగా ఏటా తెలుగు సమాజంలో సమాజ సేవ చేసిన వారిని సత్కరిస్తుంటారు. యువ తెలుగు సమాజానికి రోల్ మోడల్‌గా నిలిచిన డా.చంద్ర కన్నెగంటి CBEని కొవెంట్రీ తెలుగు వైద్యుల బృందం ఈ ఏడాది ఘనంగా సత్కరించింది. కొవెంట్రీ డిప్యూటీ మేయర్ Cllrని కూడా సత్కరించారు. ప్రముఖ నటుడు షాయాజీ షిండే లైవ్‌ కాల్ ప్రొజెక్టర్ డిస్‌ప్లేలో COTA సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని