CXO Summit: న్యూజెర్సీలో ఘ‌నంగా CXO సదస్సు

క్వాలిటీ ఇంజినీరింగ్‌ ఫౌండేషన్‌ (QEF) ఆధ్వర్యంలో CXO సదస్సు న్యూజెర్సీలో ఘ‌నంగా నిర్వహించారు.

Published : 06 Jun 2024 20:29 IST

న్యూజెర్సీ: క్వాలిటీ ఇంజినీరింగ్‌ ఫౌండేషన్‌ (QEF) ఆధ్వర్యంలో CXO సదస్సు అమెరికాలోని న్యూజెర్సీలో ఘ‌నంగా జ‌రిగింది. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ISF) సహకారంతో క్యూఈఎఫ్‌ (QEF) దీన్ని నిర్వహించింది. ‘‘ఎంపవరింగ్‌ ఇన్నోవేషన్‌- క్వాలిటీ ఇంజినీరింగ్‌’’ థీమ్‌తో సదస్సును ఏర్పాటుచేశారు. దీనిలో స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌, భవిష్యత్తుకు సంబంధించిన క్వాలిటీ ఇంజినీరింగ్‌ వంటి అంశాలపై దృష్టిపెట్టారు. 

‘‘ఈ సదస్సు కీలక మైలురాయిని సూచిస్తుంది. ఎందరో ఎంటర్‌ ప్రెన్యూర్స్‌, మెంటార్స్‌, ఇన్వెస్టర్లకు ఉత్తమ వేదికగా మారుతుంది. ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్షిప్‌ కోసం ఈ ప్రపంచ వేదిక ఎంతోమందిని ప్రోత్సహిస్తుంది’’ అని QEF వ్యవస్థాపక అధ్యక్షుడు అట్లూరి పేర్కొన్నారు. 

ఈ స‌మ్మిట్‌లో పాల్గొన్న ISF వ్యవస్థాపక అధ్యక్షుడు డా.జేఏ చౌదరి దిశానిర్దేశం చేశారు. క్వాలిటీ ఇంజినీరింగ్‌లో ఆవిష్కరణలు చేసిన‌ డా.మాధవ్ ఫడ్కేల‌కు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డులు అందించి సత్కరించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆయా కంపెనీల అధినేత‌లు, మెంటార్స్, ఎంట‌ర్‌ప్రెన్యూర్స్, ఇన్వెస్టర్లను QEF సత్కరించింది. ఈ సదస్సులో నగేశ్‌ చెరుకుపల్లి, మంగేశ్‌ చింతమనేని, మురళి వుల్లగంటి, శేఖర్ పన్నాల, స్వాతి అట్లూరి, స్వామి కొచ్చెర్లకోట, రామ్ నాగప్పన్, సుబ్బా ఆరుమిల్లి, సామ్ మద్దాలి, శరత్ వేట, సంతోష్ యంసాని, అనిల్ వల్లాల, రాజ్ పాటిల్, ప్రియా సమంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఎంబ‌సీ అధికారుల‌తో ISF- QEF నాయ‌కుల భేటీ

ISF - QEF నాయ‌కులు ఇండియ‌న్ ఎంబ‌సీ అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. స్టార్టప్‌ ప్రమోషన్‌తో స‌హా భార‌త్ - అమెరికా మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి వంటి అంశాలతో పాటు నాణ్యమైన పురోగతిని ఎలా సాధించాలో చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని