కెనడాలో ఉత్సాహంగా ‘తాకా’ దీపావళి రంగేళి

అక్టోబర్ 29న టోరంటోలోని టోరంటో పెవిలియన్‌ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిపిన ఈ వేడుకలకు వందలాది మంది తరలివచ్చారు.

Published : 31 Oct 2022 17:02 IST

టోరంటో: తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో కెనడాలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్టోబర్ 29న టోరంటోలోని టోరంటో పెవిలియన్‌ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలకు వందలాది మంది తరలివచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా దాదాపు 1500 మందికి పైగా తెలుగువారు పాల్గొన్న ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, లిఖిత యార్లగడ్డ, ఇందు నిట్ల, విద్య బుద్ధరాజు, జయకిరణ్ కొనకాల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తొలుత ‘తాకా’ కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఆహ్వానం పలికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆ సంఘం అధ్యక్షులు కల్పన మోటూరి, కీర్తి కూన, శ్రీదేవి పేరిచర్ల, శృతి ఏలూరి, వీణ మార్పిన జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకల్ని ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా తాకా చేస్తోన్న అనేక కార్యక్రమాలను కల్పన వివరించారు. అనంతరం దాదాపు 200 మందికి పైగా చిన్నారులు, కళాకారులు వారి ఆట పాటలతో, నృత్యాలతో అదరగొట్టారు. 40కి పైగా తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలతో 7గంటలు పాటు అందరినీ అలరించారు.

ఈ సందర్భంగా అనేక ఏళ్లుగా తాకాకు చేయూతగా నిలుస్తోన్న ప్రధాన దాతలు రమేష్ గోల్లు, ఆనంద్ పేరిచర్ల, తదితరులను కార్యవర్గ సభ్యులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా తాకా వ్యవస్థాపక సభ్యులు హనుమంతాచారి సామంతపూడి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి గత 12ఏళ్లుగా తాకా కెనడాలో ఎంతగా అభివృద్ధి చెందిందో వివరించారు. ఈ ఉత్సవాల్లో వివిధ రకాలైన  తెలుగు వంటకాలతో దీపావళి విందును ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం విజయవంతానికి కృషిచేసిన తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జునచారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరెక్టర్లు గణేష్ తెరాల,రాణి మద్దెల, శృతి ఏలూరి, ప్రదీప్ రెడ్డి ఏలూరు, యూత్ డైరెక్టర్లు విద్య భవనం, ఖాజిల్ మహమ్మద్, బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, తాకా వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, శ్రీనాథ్ కుందూరు, అరుణ్ లయం ,లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, రామచంద్ర రావు దుగ్గినతో పాటు వాలంటీర్లందరినీ తాకా అధ్యక్షులు కల్పన మోటూరి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన అందరికీ తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా కెనడా, భారతదేశ జాతీయ గీతాలు ఆలపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు