UK: స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

యూకేలో ప్రవాస తెలుగువారు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Published : 30 Oct 2022 18:26 IST

లండన్‌: యూకేలో ప్రవాస తెలుగువారు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. స్టోక్‌ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించిన ఈ వేడుకల్లో  చిన్నారులు, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఈ  సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని