దుబాయిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

భారత జాతిపిత మహాత్మా గాంధీ  జయంతి వేడుకలు దుబాయిలో ఘనంగా జరిగాయి. ప్రపంచానికి శాంతి, అహింసా మార్గం చూపిన మహాత్ముడి జయంతి.......

Published : 02 Oct 2022 21:00 IST

దుబాయి: భారత జాతిపిత మహాత్మా గాంధీ  జయంతి వేడుకలు దుబాయిలో ఘనంగా జరిగాయి. ప్రపంచానికి శాంతి, అహింసా మార్గం చూపిన మహాత్ముడి జయంతి వేడుకల్ని యూఏఈలో సింగిరి అండ్ కో ఆడిట్ ఫర్మ్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించారు. గాంధీజీ పుట్టిన దేశంలో తామంతా జన్మించడం గర్వకారణమంటూ కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..  గాంధీజీ పుట్టిన దేశంలో తాము జన్మించడం గర్వకారణమన్నారు. ప్రపంచ దేశాలకు శాంతి, అహింసా మార్గాన్ని చూపిన మహనీయుడి జయంతిని దుబాయిలో నిర్వహించుకోవడం భారతీయులుగా గర్వపడుతున్నామని చెప్పారు. కుల, మత, వర్గ రహితంగా ప్రజల్ని ఏకం చేసి స్వాతంత్ర్య సాధనకు పరుగులు పెట్టించిన గొప్పమానవతావాది అని, ఆయన చెప్పే మాట, వేసే ప్రతి అడుగు ఆచరణీయమంటూ కొనియాడారు. దుబాయిలో తొలిసారి మహాత్ముడి జయంతి వేడుకలు జరపడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాసీయులు డాక్టర్‌ ముక్కు తులసీ కుమార్‌, సింగిరి రవి కుమార్, కసారం రమేష్, గరగపర్తి రాంకీ, తడివాక రమేష్ నాయుడు,  కోడి రవికిరణ్, గోపి బర్మా తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు