కాట్రగడ్డ సుధాకర్‌ స్మారకార్థం ‘తానా’ వాలీబాల్‌, త్రోబాల్‌ టోర్నమెంట్‌

దివంగత తానా నాయకుడు సుధాకర్‌ కాట్రగడ్డ స్మారకార్థం వాలీబాల్‌, త్రో బాల్‌ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. తానా ఆధ్వర్యంలో అమెరికాలోని నోవిలో ఉన్న స్పార్క్‌ ఎరీనాలో నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది.

Published : 16 Oct 2022 08:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దివంగత తానా నాయకుడు సుధాకర్‌ కాట్రగడ్డ స్మారకార్థం వాలీబాల్‌, త్రో బాల్‌ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. తానా ఆధ్వర్యంలో అమెరికాలోని నోవిలో ఉన్న స్పార్క్‌ ఎరీనాలో నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది. తానా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ శృంగవరపు, తానా ఫౌండేషన్‌ ట్రస్టీ సురేశ్‌ పుట్టగుంట ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్‌ నిర్వహించారు. 37 టీమ్‌లు, 500 మంది ప్లేయర్లతో ఇండోర్‌ స్టేడియం కళకళలాడింది. మిచిగన్‌ అటార్నీ జనరల్‌ డేనా నెసెల్‌ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానా సేవలను కొనియాడారు.  కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. 

అనంతరం నిరంజన్‌ శృంగవరపు మాట్లాడుతూ సుధాకర్‌ కాట్రగడ్డ సేవలను కొనియాడారు. ‘‘నిస్వార్థ సేవా దృక్పథానికి, స్నేహశీలతకు, మంచితనానికి సుధాకర్‌ మారుపేరు. తానాకు ఆయన అందించిన సేవలు ఎంతో విలువైనవి. ఎన్నో సేవలతో అశేషమైన తానా సభ్యుల అభిమానాన్ని పొందిన మహోన్నత వ్యక్తి. సుధాకర్‌ సేవలకు గుర్తుగా ఆయన పేరుపై వాలీబాల్‌, త్రోబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించాం’’ అని చెప్పారు. ఈ టోర్నమెంట్‌ ద్వారా వచ్చిన విరాళాలను తానా అన్నపూర్ణ ప్రాజెక్టు (ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత నిత్యాన్నదాన కార్యక్రమం)కు వినియోగిస్తామని నిరంజన్‌ తెలిపారు. 

తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ హనుమయ్య బండ్ల మాట్లాడుతూ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తానా ఈ టోర్నమెంట్‌ నిర్వహించిందన్నారు. నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతానికి స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ శశాంక్‌ యార్లగడ్డ, రీజినల్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ గోగినేని, స్థానిక తానా నాయకులు, ఇతర పెద్దలు ప్రోత్సాహం అందించారు. కార్యక్రమం చివర్లో సురేశ్‌ పుట్టగుంట వందన సమర్పణ చేశారు. స్పార్క్‌ ఎరీనా మేనేజ్‌మెంట్‌, కార్యక్రమానికి సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని