ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపా ప్రభంజనం ఖాయం: టీడీ జనార్దన్‌

ఏపీలో సీఎం జగన్‌ రాక్షసపాలనను అంతమొందించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధిస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ ధీమా వ్యక్తం చేశారు.

Updated : 05 Nov 2022 01:15 IST

బహ్రెయిన్: ఏపీలో సీఎం జగన్‌ రాక్షసపాలనను అంతమొందించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధిస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా సాధించే విజయం చరిత్రలో మైలురాయిగా నిలవబోతోందన్నారు. బహ్రెయిన్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి టీడీ జనార్దన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెదేపా ఎన్‌ఆర్‌ఐ గల్ఫ్‌  విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. తెదేపా బహ్రెయిన్ విభాగం అధ్యక్షుడు రఘునాథబాబు నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.   

ఈ సందర్భంగా టీడీ జనార్దన్‌ మాట్లాడుతూ... ‘‘1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించింది. ఏపీ చరిత్రలో తెదేపా ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించదగినది. సీఎంగా ఎన్టీఆర్‌ పలు సంక్షేమ పథకాలను  ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు నాయుడు నూతన వరవడి సృష్టించారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రభుత్వంపై భారం పడకుండా 33వేల ఎకరాల భూమి సేకరించారు. ఇది చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైంది. సీఎం జగన్‌ పాలనలో ఏపీ అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి పథంలో నడిపించడం ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యం. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం చారిత్రక అవసరం’’ అని టీడీ జనార్దన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కౌన్సిల్ కన్వీనర్ హరిబాబు, బహ్రెయిన్ తెదేపా ఉపాధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి ఏవీ రావు, కోశాధికారి బొల్లా సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని