తానా మహాసభల నిర్వహణకు రూ.48 కోట్ల విరాళాలు

తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 23వ మహాసభల నిర్వహణకు చేపట్టిన విరాళాల కార్యక్రమానికి అంచనాకు మించిన స్పందన లభించింది.

Updated : 08 Nov 2022 05:25 IST

ఈనాడు, అమరావతి: తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 23వ మహాసభల నిర్వహణకు చేపట్టిన విరాళాల కార్యక్రమానికి అంచనాకు మించిన స్పందన లభించింది. 2023 జులై 7 నుంచి 9 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న తానా మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నవంబరు 5న పెన్సిల్వేనియాలోని వార్మిన్‌స్టర్‌ నగరంలోని ఫ్యూజ్‌ బాంక్వెట్‌హాల్‌లో విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 800 మందికి పైగా ప్రవాసులు హాజరై రూ.48 కోట్ల విరాళాలు ప్రకటించారు. ఇది గతంలోని అన్ని విరాళాల సేకరణనూ మించిపోయిందని తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరి లావు తెలిపారు. ఈ సందర్భంగా ఈసీ, బీఓడీ, ఫౌండేషన్‌ సభ్యులు, మాజీ అధ్యక్షులు, ఇతర కమిటీ సభ్యులను పరిచయం చేస్తూ.. వారి సేవలను కొనియాడారు. తానా 23వ మహాసభల ప్రాధాన్యాన్ని వివరించారు. విరాళాల సేకరణ కార్యక్రమానికి ఊహించని స్పందన లభించిందని కన్వీనర్‌ పొట్లూరి రవి వివరించారు. పీపుల్స్‌ మీడియా అధినేత విశ్వప్రసాద్‌, డెక్కన్‌ స్పైస్‌ గోవర్ధన్‌ బొబ్బా, జగదీశ్‌ యలమంచిలి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని