పార్టీ సహాయ నిధికి ‘తెదేపా ఎన్‌ఆర్‌ఐ ఖతార్‌’ రూ.15.5లక్షల విరాళం

రాష్ట్ర భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఉంటామని ఆ పార్టీ ఖతార్‌ ఎన్ఆర్‌ఐ విభాగం నేతలు తెలిపారు.

Updated : 03 Jan 2023 15:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాష్ట్ర భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఉంటామని ఆ పార్టీ ఖతార్‌ ఎన్ఆర్‌ఐ విభాగం నేతలు తెలిపారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో చంద్రబాబుతో వారు భేటీ అయి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా సహాయ నిధికి రూ.10లక్షలు, కార్యకర్తల వైద్య సహాయార్థం రూ.5.5లక్షల విరాళం అందజేశారు. దీనికి సంబంధించిన చెక్కులను ఖతార్‌ తెదేపా ఎన్‌ఆర్‌ఐ నేత గొట్టిపాటి రమణ, ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేశ్‌ నేతృత్వంలోని బృందం చంద్రబాబకు అందజేసింది. ఈ కార్యక్రమంలో గొట్టిపాటి రమణతో పాటు ఆయన సతీమణి లక్ష్మి, విజయ్‌భాస్కర్‌ దండ, కొడాలి సుధాకర్‌ దంపతులు, వెంకప్ప భాగవతులతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

పార్టీ నిధికి, కార్యకర్తల వైద్య సహాయార్థం స్పందించి విరాళాలను అందజేసినందుకు చంద్రబాబుతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు అశోక్‌బాబు, పట్టాభి, డాక్టర్‌ రవి వేమూరి, బుచ్చి రాంప్రసాద్‌, చప్పిడి రాజశేఖర్‌ తదితరులు తెదేపా ఖతార్‌ విభాగం నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. రూ.15.5లక్షల నిధులను పార్టీకి అందజేసినందుకు ఖతార్‌ తెదేపా సభ్యులకు పార్టీ గల్ఫ్‌ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఎన్‌ఆర్‌ఐ తెదేపా గల్ఫ్‌ ఎంపవర్‌మెంట్‌ కోఆర్డినేటర్‌ కుదరవల్లి సుధాకర్‌రావు, ఖతార్‌ గల్ఫ్‌ కౌన్సిల్‌ సభ్యుడు మలిరెడ్డి సత్యనారాయణ అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని