కాకతీయ సాంస్కృతిక పరివారం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు

సింగపూర్‌లోని కాకతీయ సాంస్కృతిక పరివారం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.

Published : 31 Jan 2023 15:22 IST

సింగపూర్‌: సింగపూర్‌లోని కాకతీయ సాంస్కృతిక పరివారం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.
భావితరాలకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, విలువలు, పండుగల ప్రాముఖ్యత గురించి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో   ఈ వేడుకలను నిర్వహించారు. సింగపూర్‌ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్‌ డిజైన్ (SUTD) వేదికగా జరిగిన సంబరాల్లో దాదాపు 550కి పైగా కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులు పాల్గొన్నారు.

సంక్రాంతి పండుగ విశిష్టత, సంప్రదాయాల వెనుక దాగిఉన్న విషయాలను పిల్లలకు వివరించారు. సంస్థ అధ్యక్షులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ సంస్థ స్థాపించి 3 సంవత్సరాలు అయిందని, కోవిడ్ తదనంతరం తమ సంస్థ ఇంత మంది తెలుగు వారితో కలిపి జరుపుకొంటున్న అతి పెద్ద పండుగ ఇదేనని వివరించారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి రావడం ద్వారా మరింత మంది తెలుగు వారు స్నేహితులు అయ్యారని అలాగే విభిన్నమైన ఆటల ద్వారా ఒకరితో ఒకరికి పరిచయాలు పెంచుకునేలా రూపొందించిన కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని