సౌదీ అరేబియాలో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి సమావేశం

సౌదీ అరేబియాలోని జుబైల్‌లో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి భేటీ అయ్యింది.  రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ‘ఎన్నికల సన్నాహక ఆత్మీయ సమావేశం’ పేరిట ఈ భేటీ నిర్వహించారు.

Published : 09 Mar 2024 13:11 IST

జుబైల్‌: సౌదీ అరేబియాలోని జుబైల్‌లో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి భేటీ అయ్యింది.  రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ‘ఎన్నికల సన్నాహక ఆత్మీయ సమావేశం’ పేరిట ఈ భేటీ నిర్వహించారు. తెదేపా తరుఫున గల్ఫ్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, సౌదీ అధ్యక్షుడు ఖాలిద్ షైఫుల్లా, భరద్వాజ్, కోగంటి శ్రీనివాస్‌, చంద్రశేఖర్, నాగేశ్వరరావు, జనసేన సౌదీ అరేబియా కన్వీనర్లు గుండాబత్తుల సూర్య భాస్కరరావు, కసిరెడ్డి శ్రీ నగేష్, చింతల మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సమావేశానికి బహ్రెయిన్ తెదేపా గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు హరిబాబు తక్కిళ్లపాటి, వాసుదేవ రావు, తెదేపా, జనసేన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, సీనియర్‌ సభ్యులు హాజరయ్యారు. గెలుపే లక్ష్యంగా కూటమి నేతలంతా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. జూమ్ కాల్‌లో తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, జనసేన నాయకుడు కందుల దుర్గేష్, జనసేన వైజాగ్ నార్త్ నియోజకవర్గ ఇంఛార్జ్‌ పసుపులేటి ఉషా కిరణ్, బండిరెడ్డి రామకృష్ణ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కూటమిని బలోపేతం చేయడానికి ఇరు పార్టీల నేతలు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఈ సమావేశంలో సౌదీ అరేబియా ఎన్నారై తెదేపా, జనసేన పార్టీ నాయకులు ప్రచార వ్యూహాలు, విధానాలు, వనరుల కేటాయింపు, ఓటర్లను చేరుకునే అంశాలపై చర్చించారు. గ్రామ స్థాయి, మండల స్థాయిలో కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.  తెదేపా-జనసేన కూటమిని బలీయమైన ఎన్నికల ఫ్రంట్‌గా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశం బహిరంగ చర్చలు, మేధోమథన సెషన్‌లకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో విలువైన సూచనలు చేసిన ఇరు పార్టీల నేతలకు నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని