సింగపూర్‌లో స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు

మార్చి 18న స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో నివసించే తెలుగు గాయకులు ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకొన్నారు. 

Published : 23 Mar 2024 14:38 IST

సింగపూర్‌: మార్చి 18న స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో నివసించే తెలుగు గాయకులు త్యాగరాజ ఆరాధనోత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. సంగీత సాగరంలో ఓలలాడి, రామభక్తిలో మునిగి తేలారు. యడవల్లి శేషు కుమారి, సౌభాగ్య లక్ష్మి, షర్మిల, సౌమ్య, కిరిటి, శేషశ్రీ తదితరులు రాగ పంచరత్న కీర్తనలు ఆలపించారు. యడవల్లి శ్రీ విద్య ‘తెర తీయగ రాదా’ అను కీర్తనతో స్వామిని కొలువగా,  ‘ఆరగింపవే’ అను భక్తి నైవేద్యాలతో, ‘పతికి మంగళ హారతీరే’ అంటూ మంగళ హారతులతో అందరూ త్యాగరాజ స్వామిని ఆరాధించారు.  అనంతరం స్వర లయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షులైన శేషు కుమారి జ్ఞాపికలను బహూకరించి సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని