అమెరికా ‘వీసా’వహులకు తీపి కబురు
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా(ఎఫ్-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
ఆగస్టు వరకు విద్యార్థి ఇంటర్వ్యూలు
జూన్ నుంచి దశల వారీగా స్లాట్ల విడుదల
ఈనాడు, హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా(ఎఫ్-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలో ఫాల్ ఎడ్యుకేషన్ సీజన్ ఆగస్టు-సెప్టెంబరులో ప్రారంభమవుతుంది. సాధారణంగా సీజన్ చివరి వారంలో ఒక దఫా ఇంటర్వ్యూలో వీసా దరఖాస్తు ఆమోదం పొందనివారికి మరో అవకాశం కల్పిస్తారు. ఈ దఫా ఆగస్టు నెలాఖరు వరకు వీసా స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించటం విశేషం. ఆ సీజన్లో అమెరికా వెళ్లేందుకు ఇప్పటికే స్లాట్లు తీసుకున్న విద్యార్థులకు సోమవారం నుంచి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన తొలి విడత ఇంటర్వ్యూ తేదీల(స్లాట్ల)ను అమెరికా ఈ నెల రెండో వారం ప్రారంభంలోనే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దఫా పెద్దసంఖ్యలో భారతీయ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా దశలవారీగా స్లాట్లు విడుదల చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. విద్యార్థి వీసా సీజన్లో ఆగస్టు చివరి వరకు స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. చివరి నిమిషంలో వెళ్లేవారికీ ఉపయుక్తంగా ఉండాలన్న ఆలోచనతో ఆగస్టు దాకా ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో మరిన్ని స్లాట్లు విడుదల చేయనున్నారు. దిల్లీలోని రాయబార కార్యాలయం, హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్కతాలలోని కాన్సుల్ జనరల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారిక వెబ్సైట్లో స్లాట్లు అందుబాటులో ఉన్నట్లు కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రకటించింది.
విద్యార్థులకు 24న అవగాహన కార్యక్రమం
ప్రస్తుత ఫాల్ సీజన్‌తోపాటు 2025 స్ప్రింగ్ సీజన్లో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం హైబ్రిడ్ విధానంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషన్ యూఎస్ఏ మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆన్లైన్లో హాజరు కావాలనుకునేవారు bit.ly/EdUSASVS24 ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా హాజరు కావాలనుకునేవారికి ఎస్.ఎల్.జూబ్లీ కాంప్లెక్స్, 4వ అంతస్తు, రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో అమెరికా వీసా కాన్సులర్ అధికారి వీసా దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్‌లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్‌లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్‌లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్‌లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్‌లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్‌లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్‌లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్‌లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్‌లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్‌లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్‌లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్‌రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి