అట్లాంటా, దుబాయ్‌లలో తెదేపా విజయోత్సవాలు

ఏపీలో ఎన్డీయే తిరుగులేని విజయం సాధించడంతో అట్లాంటా, దుబాయ్‌లలో తెదేపా ఎన్నారై విభాగం నాయకులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. కేక్‌ కోసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 07 Jun 2024 06:42 IST

అట్లాంటాలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మహిళలు

ఈనాడు డిజిటల్, అమరావతి: ఏపీలో ఎన్డీయే తిరుగులేని విజయం సాధించడంతో అట్లాంటా, దుబాయ్‌లలో తెదేపా ఎన్నారై విభాగం నాయకులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. కేక్‌ కోసి శుభాకాంక్షలు తెలిపారు. అట్లాంటాలో జరిగిన సంబరాలకు తెలుగు మహిళలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెదేపా, జనసేన జెండాల్ని ప్రదర్శించి..ఎన్డీయే నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. దుబాయ్‌లో మహిళలు, యువత, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెదేపా ఎన్నారై విభాగం దుబాయ్‌ బృంద ప్రతినిధులు సునీల్, మోహన్‌మురళీ, ఆత్కూరి శివ, రాధాకృష్ణ ఉన్నారు. 


టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ నగరంలో సంబరాల్లో మునిగిన తెదేపా, జనసేన అభిమానులు

న్యూస్‌టుడే, కంకిపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని