డార్ట్‌ఫోర్డ్‌లో ఉల్లాసంగా హోలీ వేడుకలు

బ్రిటన్‌లోని డార్ట్‌ఫోర్డ్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కెంట్‌లోనే అతిపెద్ద ఈవెంట్‌గా చేపట్టిన ఈ వేడుకలకు 3వేల మందికి పైగా హాజరయ్యారు.  

Published : 29 Mar 2024 19:11 IST

డార్ట్‌ఫోర్డ్‌: బ్రిటన్‌లోని డార్ట్‌ఫోర్డ్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కెంట్‌లో అతిపెద్ద ఈవెంట్‌గా చేపట్టిన ఈ వేడుకలకు 3 వేల మందికి పైగా హాజరయ్యారు. డార్ట్‌ఫోర్డ్ బోరో కౌన్సిల్, ఆర్ట్స్ కౌన్సిల్ ఇంగ్లాండ్, కోహెషన్‌ప్లస్ మద్దతుతో పలువురు ప్రముఖుల సమక్షంలో స్థానిక కమ్యూనిటీ సభ్యులు కలిసి ఆనందంగా హోలీ వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులంతా పరస్పరం హోలీ శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఇంద్రధనస్సు రంగులు చల్లుకునే వినోదంలో భాగస్వాములయ్యారు.  ఈసందర్భంగా ఏర్పాటుచేసిన డీజే సంగీతానికి పలువురు నృత్యాలు చేయడంతో పాటు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించారు. వీడియోలు, ఫోటోలు, సోషల్ మీడియాలో అప్‌డేట్‌లతో సందడిగా గడిపారు. 

ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళల నృత్య ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య కౌన్సిలర్లు వేదికపై పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. మార్చి 24న స్థానిక కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లు, డార్ట్‌ఫోర్డ్‌ బరో కౌన్సిల్‌ మద్దతుతో డార్ట్‌ఫోర్డ్‌ సెంట్రల్‌ పార్కులో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతమైందని కమ్యూనిటీ వాలంటీర్‌ కృష్ణ పవన్‌ చల్లా తెలిపారు. 

వేడుకలకు హాజరైన ప్రముఖులు వీరే.. 

గారెత్ జాన్సన్, బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు; కౌన్సిలర్ రోసన్నా కుర్రాన్స్ - మేయర్ డార్ట్‌ఫోర్డ్ బోరో కౌన్సిల్; కౌన్సిలర్ జెరెమీ కైట్ MBE – లీడర్ డార్ట్‌ఫోర్డ్ బోరో కౌన్సిల్; కౌన్సిలర్ క్రిస్ షిప్పం - డిప్యూటీ లీడర్ డార్ట్‌ఫోర్డ్ బరో కౌన్సిల్; కౌన్సిలర్ రిచర్డ్ వెల్స్; గుర్విందర్ సంధర్ MBE - డిప్యూటీ లెఫ్టినెంట్ కెంట్; కౌన్సిలర్ అవతార్ సంధు MBE; కౌన్సిలర్ థామస్ ఆలివర్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని