TDP Kuwait: ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా లోకేశ్ జన్మదిన వేడుకలు
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలను కువైట్‌లో ఘనంగా నిర్వహించారు.
ఇంటర్నెట్‌డెస్క్: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలను కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్ ఆధ్వర్యంలో ఫర్వానియా ప్రాంతాంలో అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్‌నాయుడు ఆధ్వర్యంలో లోకేశ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు, నారా, నందమూరి అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ లోక్‌శ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకరరావు, కువైట్ గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ కోడూరి వెంకట్, కువైట్‌లో తెదేపా సీనియర్ నేతలు ఎనిగళ్ల బాలకృష్ణ, కువైట్‌లోని కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షుడు రహమతుల్లా, షేక్ బాషా, ప్రధాన కార్యదర్శి వేగి వెంకటేశ్ నాయుడు, గవర్నరేట్ కో-ఆర్డినేటర్స్ ఈడుపుగంటి దుర్గా ప్రసాద్, ముస్తాక్‌ఖాన్, తెలుగు యువత అధ్యక్షుడు కాపెర్ల వంశీకృష్ణ, నరేష్ నన్నపనేని, మైనార్టీ నాయకులు షేక్ చాన్ బాషా, చిన్నా రాజు, మల్లికార్జున యాదవ్, మంచూరి శివ, కొల్లి ఆంజనేయులు, గుండయ్య నాయుడు, శివ మద్దిపట్ల, షేక్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు మద్దతుగా కువైట్‌లోనూ పాదయాత్ర నిర్వహిస్తామని.. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నామని నేతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: ఎవరి అంతరాత్మ ఎలా ప్రభోదిస్తుందో?.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి
-
Sports News
IND vs AUS: భారత్, ఆసీస్ మూడో వన్డే.. ఆలౌటైన ఆస్ట్రేలియా
-
India News
Modi: JAM-జన్‌ధన్, ఆధార్, మొబైల్.. ప్రపంచానికే ఓ కేస్‌స్టడీ
-
Crime News
Vijayawada: విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48కోట్ల విలువైన బంగారం పట్టివేత
-
Education News
RRC Secunderabad: దక్షిణ మధ్య రైల్వే.. గ్రూప్-డి తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు