కెంటకీలో వైభవంగా దీపావళి.. ఉర్రూతలూగించిన సంగీత విభావరి

కెంటకీ రాష్టంలోని లుయివిల్‌ నగరంలో కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి.

Published : 08 Nov 2022 21:41 IST

అమెరికా: కెంటకీ రాష్టంలోని లుయివిల్‌ నగరంలో కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఆహూతులను ఉర్రూతలూగించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌, గాయని గీతా మాధురి బృందం పాల్గొన్న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు భారీగా  తరలివచ్చారు. ఆర్పీ పట్నాయక్ స్వరపరచిన ఎన్నో హిట్ సినీగీతాలను గాయకులు ఆలపించి ప్రేక్షకులకు వీనుల విందు చేశారు. వీటితో పాటు ప్రజాదరణ పొందిన ఈ పాటలకు ప్రేక్షకులు నృత్యాలతో సందడి చేశారు. 

కార్యక్రమంలో భాగంగా లుయివిల్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ప్రదర్శించిన  డాన్స్ మెడ్లీ  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంస్థ అధ్యక్షురాలు లక్ష్మీ అడ్డాల మాట్లాడుతూ.. ఇప్పటివరకు కెంటకీ తెలుగుసంఘం  నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు ఛైర్మన్‌ ప్రతాప్‌ చిలుకూరి స్పాన్సర్స్‌ను అభినందించారు. కెంటకీ గవర్నర్‌ ఆండీ బషీర్ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. కెంటకీ అభివృద్ధిలో తెలుగు ఎన్నారైల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సరస్వతి తూటుపల్లి, సింధు మారిగంటి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఆద్యంతం ఉత్సాహంగా నడిపించారు. శ్రీనివాస్ వేమూరి, తేజశ్రీ నేరెళ్ళ సాంస్కృతిక కార్యదర్శులుగా వ్యవహరించగా.. తందూరి ఫ్యూజన్ వారు ఆహూతులకు  భోజన ఏర్పాట్లు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని