నాట్స్‌ ‘రండి రచయితలవుదాం!’ కార్యక్రమానికి చక్కటి స్పందన

‘భాషే రమ్యం.. సేవే గమ్యం’ అనే తమ నినాదానికి తగ్గట్టుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) గొప్ప కార్యక్రమం నిర్వహించింది. 

Published : 14 Nov 2022 17:19 IST

అమెరికా: ‘భాషే రమ్యం.. సేవే గమ్యం’ అనే తమ నినాదానికి తగ్గట్టుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) గొప్ప కార్యక్రమం నిర్వహించింది. అమెరికాలో తెలుగువారికి మాతృభాషపై మరింత పట్టు పెంచేందుకు ‘రండి రచయితలవుదాం’ అనే ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టింది. కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి నేతృత్వంలో పద్యాలు ఎలా రచించాలనే దానిపై శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ పద్య రచనా శిక్షణా తరగతులకు తెలుగువారి నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. చాలామంది ఆన్‌లైన్‌లో ఈ శిక్షణ తరగతులకు హాజరై తాము సొంతంగా సరళ పద్యాలను ఎలా రచించాలో నేర్చుకుంటున్నారు. దీంతో పాటు పద్య గానం ఎలా ఉండాలి? రాగయుక్తంగా ఎలా ఆలపించాలనే అంశాలనూ  రామలింగ స్వామి నేర్పిస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టిన నాట్స్ పట్ల అమెరికాలో తెలుగు భాష ప్రేమికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తెలుగు భాషా ప్రేమికులే ఈ ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటున్నారు. నాట్స్ గతంలో పద్య పోటీలు నిర్వహించిందని.. తెలుగు భాష అభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పుడూ చేస్తూనే ఉంటుందని ఆ సంఘం ఛైర్ విమెన్ అరుణ గంటి అన్నారు. సాహిత్యం భావితరాలకు అందించేందుకు నాట్స్ మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ అధ్యక్షుడు బాపు చౌదరి(బాపు) నూతి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని