NATS: లాస్‌ ఏంజిల్స్‌ నాట్స్‌ చాప్టర్‌ నూతన కార్యవర్గం ఏర్పాటు

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాట్స్‌) చేపడుతున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు లాస్‌ ఏంజిల్స్‌ నాట్స్‌ చాప్టర్‌ నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్‌ మహమ్మారి వల్ల సమావేశం నిర్వహించలేకపోయిన అసోసియేషన్‌.. కరోనా ప్రభావం తర్వాత తొలిసారి సమావేశమయ్యారు.

Published : 04 Nov 2022 19:13 IST

లాస్ ఏంజిల్స్‌: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాట్స్‌) చేపడుతున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు లాస్‌ ఏంజిల్స్‌ నాట్స్‌ చాప్టర్‌ నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్‌ మహమ్మారి వల్ల సమావేశం నిర్వహించలేకపోయిన అసోసియేషన్‌.. కరోనా ప్రభావం తర్వాత తొలిసారి సమావేశమైంది. నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి లాస్ఏంజిల్స్ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని సభ్యులకు పరిచయం చేశారు. లాస్ ఏంజెల్స్ చాప్టర్ కో-ఆర్డినేటర్‌గా మనోహర రావు మద్దినేని, జాయింట్ కో-ఆర్డినేటర్‌గా మురళీ ముద్దనకి బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరి నేతృత్వంలో పనిచేయబోయే బృందాన్ని నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి అందరికీ పరిచయం చేశారు.

కొవిడ్ సమయంలో గత కార్యవర్గం చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని.. అదే స్ఫూర్తితో కొత్త నాయకత్వం పనిచేస్తుందని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. నెలలో ఒకసారి వర్చువల్‌గా, ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో స్థానిక నాట్స్ నాయకులు వెంకట్ ఆలపాటి, వంశీ మోహన్ గరికపాటి, నాట్స్ స్పోర్ట్స్ నేషనల్ కో-ఆర్డినేటర్ దిలీప్ సూరపనేని, ఈవెంట్స్ ఛైర్ బిందు కామిశెట్టి, హెల్ప్‌లైన్ ఛైర్‌ శంకర్ సింగంశెట్టి, స్పోర్ట్స్ ఛైర్ కిరణ్ ఇమ్మడిశెట్టి, కమ్యూనిటీ సర్వీసెస్ ఛైర్ అరుణ బోయినేని, మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఛైర్‌ ప్రభాకర్ రెడ్డి పాతకోట, ఫండ్ రైజింగ్ ఛైర్‌ గురు కొంక, కో-ఛైర్స్, వాలంటీర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని