TDP-Janasena: ఎన్‌ఆర్‌ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు

ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Published : 30 Mar 2024 16:39 IST

కువైట్‌: ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని అక్కడి తెలుగు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. తెదేపా గల్ఫ్ ఎంపవర్మెంట్‌ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర్‌రావు అధ్యక్షతన తెదేపా కువైట్ అధ్యక్షులు మద్దిన ఈశ్వర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈసందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు 1982లో ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో పేదల కోసం పెట్టిన పార్టీ ‘తెదేపా’   అని అన్నారు. అలాంటి పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ.. మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించాలని కోరారు. ఎవరైనా ఎన్నికలకు వెళ్లలేకపోతే.. వాళ్లు తమ స్నేహితులు, కుటుంబసభ్యులకు అవగాహన కల్పించి కూటమి సభ్యులు గెలుపొందేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్లు రామచంద్ర నాయక్, కాంచన శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించి, సైకో పాలనకు చరమగీతం పాడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఓ దుర్మార్గుడి చేతిలో ఇరుక్కుపోయిందని వ్యాఖ్యానించారు. మద్యం, ఇసుక మాఫియా, గంజాయి రవాణాలకు రాష్ట్రం అడ్డాగా మారిందని చెప్పారు. దీనినుంచి బయటపడాలంటే ఎన్డీయే కూటమిని గెలిపించాలని కోరారు. తెదేపా సీనియర్ నాయకులు ములకల సుబ్బారాయుడు మాట్లాడుతూ అభివృద్ధి జరగాలన్నా, రాష్ట్ర రాజధాని కావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ఎన్డీయే కూటమిని గెలిపించాలన్నారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్ ఉపాధ్యక్షులు షేక్‌ బాషా మాట్లాడుతూ.. తమ ఆహ్వానం మన్నించి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా సీనియర్‌ నాయకులు, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి, కోశాధికారి ఎనుగొండ నరసింహ, సోషల్ మీడియా ఇన్‌ఛార్జి వి.సి.సుబ్బారెడ్డి, గవర్నరేట్ కోఆర్డినేటర్లు ఈడుపుగంటి దుర్గాప్రసాద్, పెంచల్ రెడ్డి, కుటుంబరావు, ముష్తాక్ ఖాన్, ముఖ్య నాయకులు పోలారపు బాబు నాయుడు, ములకల రవి, పద్మరాజు వేణు, శివ మద్దిపట్ల, నరేష్ సన్నపనేని, పెంచల్ సన్నపనేని తదితరులతోపాటు, జనసేన కువైట్ కన్వీనర్ ఆకుల రాజేష్, ఇమ్మిడిశెట్టి సూర్యనారాయణ, వేణు, ఓబులేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని