DTA: డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్ దుగ్గిరాల

అమెరికాలో 46 ఏళ్ల చరిత్ర కలిగిన డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్‌(డీటీఏ)అధ్యక్షుడిగా ఎన్నికైన కిరణ్ దుగ్గిరాల తాజాగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

Published : 25 Nov 2022 00:57 IST

అమెరికా: అమెరికాలో 46 ఏళ్ల చరిత్ర కలిగిన డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్‌(డీటీఏ)అధ్యక్షుడిగా ఎన్నికైన కిరణ్ దుగ్గిరాల తాజాగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తానా(TANA) అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా కన్వెన్షన్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, నరేన్ కొడాలితో పాటూ పదిమందికి పైగా డెట్రాయిట్ అసోసియేషన్ పూర్వాధ్యక్షులు హాజరై నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. కిరణ్ నాయకత్వంలో డీటీఏ కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా ఎన్నారైలు, డీటీఏ మద్దతుదారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని