NTR: ఐర్లాండ్‌లో అట్టహాసంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నగరంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
డబ్లిన్: యూరప్‌లోని ఐర్లాండ్‌లో నివసిస్తున్న తెలుగు వారి ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నగరంలోని సుప్రసిద్ధ ఫీనిక్స్ పార్క్ ఈ వేడుకలకు వేదికైంది. జయంతివేడుకలను వినూత్నంగా ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించారు. తెలుగు జాతికి ఆయన అందించిన విశిష్ట సేవలను, మధురు స్మృతులను గుర్తు చేసుకున్నారు. వేడుకలకు హాజరైన వారందరికీ తెలుగు సాంప్రదాయ రుచులతో భోజనాలు పెట్టారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని ముక్తకంఠంతో నినాదాలు చేశారు. ఈమేరకు ఐర్లాండ్‌లోని భారత రాయబారికి ఆ వినతి పత్రాన్ని అందించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు
-
India News
హరివంశ్ నారాయణ్.. భావితరాలకు మీరు చెప్పేది ఇదేనా?: జేడీయూ
-
Sports News
IPL 2023: శుభ్‌మన్ గిల్ విషయంలో కోల్‌కతా ఘోర తప్పిదమదే: స్కాట్ స్టైరిస్
-
Crime News
Visakhapatnam: లాడ్జిలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి
-
Crime News
‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్’తో బురిడీ.. ఐటీ అధికారుల ముసుగు దొంగల చోరీ కేసులో కీలక విషయాలు
-
Movies News
BIG B: ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతూ.. తనను తాను నిందించుకున్న అమితాబ్