దసరా నుంచి కోటి శ్రీ శిరిడీసాయి గాయత్రి మహామంత్ర జపం, అన్నదానం

పరబ్రహ్మ శ్రీ శిరిడి సాయి భగవానులు, శ్రీ గురు వాణి అమ్మ దివ్య ఆశీస్సులతో విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం....

Updated : 28 Sep 2022 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరబ్రహ్మ శ్రీ శిరిడి సాయి భగవానులు, శ్రీ గురు వాణి అమ్మ దివ్య ఆశీస్సులతో విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం వ్యవస్థాపకులు, సాయి ఉపాసకులు గురూజీ లక్ష్మోజీ ఆధ్వర్యంలో కోటి శ్రీ శిరిడి సాయి గాయత్రి మహామంత్ర జపం, అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 5న దసరా నుంచి డిసెంబర్‌ 7 దత్త జయంతి వరకు ఈ కార్యక్రమం జరగనుంది. కరోనా మహమ్మారి నివారణ కోసం  ప్రపంచవ్యాప్తంగా శాంతి, విశ్వమానవ శ్రేయస్సు కోసం వరుసగా ఎనిమిదో ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని