వెస్ట్‌ లండన్‌ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం

లండన్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది.

Published : 23 Apr 2024 19:03 IST

లండన్‌: లండన్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం శుభకార్యాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మధ్యాహ్నం ఆశీర్వాదం, వందన సమర్పణతో ముగిశాయి. ఈసందర్భంగా సీతారాముల వారికి నిర్వహించిన పల్లకీసేవలో పిల్లలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

ఎస్వీబీటీసీసీ ట్రస్టీలు డాక్టర్‌ రాములు దాసోజు, భాస్కర్‌ నీల, కమలా కొచ్చెర్లకోట, ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌, సురేష్ గోపతి, సురేష్‌రెడ్డి గడ్డం, పావనిరెడ్డి, కేకే చివుకుల, కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వర్‌, తుకారాం రెడ్డి, రాఘవేందర్‌, గౌతమ్‌ శాస్త్రి, రవి వాసా, గోపి కొల్లూరు, రవికుమార్‌, వంశీ వుల్చి, వంశీ బోగిరెడ్డి, గోవర్దన్‌ తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు స్వచ్ఛంద సేవకులు, దాతలు ఎంతగానో సహకరించారని కొనియాడారు. బ్రాక్‌నెల్‌లో కొత్తగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఇందుకోసం www.svbtcc.orgలో అపాయింట్‌మెంట్‌ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ వేడుకల నిర్వహణలో ఎస్వీబీటీసీసీ సభ్యుల ఐక్యత, సేవాస్ఫూర్తిని ప్రతిబింబించడమే కాకుండా వాలంటీర్ల అంకితభావం, నిబద్ధత కీలక పాత్రను పోషించాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక సంబరానికి హాజరైన భక్తుల హృదయాలు భక్తి, ఆనందంతో ఉప్పొంగాయని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు