TDP - Janasena: షికాగోలో ఘనంగా తెదేపా - జనసేన ఆత్మీయ సమావేశం

తెదేపా, జనసేన నాయకులు షికాగోలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 

Updated : 13 Mar 2024 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్: షికాగోలో తెదేపా (TDP), జనసేన (Janasena) అభిమానుల ఆత్మీయ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. పసుపు సైనికులు, జన సైనికుల కలయికతో స్థానిక మాల్ ఆఫ్ ఇండియాలో ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని తమ అధినాయకుల మధ్య చిగురించిన పొత్తుల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఇరు పార్టీల అభిమానులు, కార్యకర్తలు కలసి మద్దతు తెలపడం ఇదే మొదటిసారి. 

ఈ కార్యక్రమానికి అతిథులుగా అనపర్తి తెదేపా ఇన్‌ఛార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తణుకు ఇన్‌ఛార్జి అరుమళ్లి రాధాకృష్ణ, గుడివాడ ఇన్‌ఛార్జి వెనిగండ్ల రాము, రైల్వే కోడూరు ఇన్‌ఛార్జి ప్రసాద్... జూమ్ కాల్స్ ద్వారా హాజరయ్యారు. ఈక్రమంలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తెదేపా- జనసేన కలయిక రాష్ట్రంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోందో వివరించారు. 

చంద్రబాబు విజన్, అభివృద్ధి, సంక్షేమ పథకాలు... జనసేనాని పవన్ కల్యాణ్ నిష్కళంక మనస్తత్వం, సేవా తత్పరత, పసుపుదళం, జనసైనికుల శక్తి సమ్మిళితమై రాష్ట్రంలోని దుష్ట పరిపాలనను తుదముట్టించి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తిరిగి నిలబెడుతుందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో మళ్లీ ముందుకు దూసుకుపోతుందని వక్తలు పేర్కొన్నారు.

కార్యక్రమం విజయవంతం చేయడంలో తెదేపా సీనియర్ నాయకులు హేమ కానూరు, షికాగో ఎన్నారై తెదేపా అధ్యక్షుడు రవి కాకర, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పెదమల్లు, సెక్రటరీ వెంకట్ యలమంచిలి, ట్రెజరీ విజయ్ కొరపాటి, రీజనల్ కౌన్సిల్ చిరంజీవి గల్లా, కృష్ణ మోహన్ చిలమకూరు, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, సునీల్ ఆరుమల్లి, యుగంధర్ నగేష్, షికాగో జనసేన నాయకులు వెంకట్ బత్తిన, రవి తోకల, రజనీ ఆకురాతి, కుమార్ నల్లం, ఉమాశంకర్, మిల్వాకి తెదేపా నాయకులు వెంకట్ చిగురుపాటి తదితరులు కృషి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని