టొరంటోలో ఘనంగా ‘టీసీఏ’ ధూమ్ ధామ్ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు కెనడాలోని గ్రేటర్ టోరంటో నగరంలో తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.  

Published : 06 Jun 2024 16:52 IST

టోరంటో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు కెనడాలోని గ్రేటర్ టోరంటో నగరంలో తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.  ధూమ్ ధామ్ పేరిట డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు దాదాపు 1800 మందికిపైగా తెలంగాణ వాసులు ఉత్సాహంగా హాజరై సందడి చేశారు. పలువురు చిన్నారులు, యువతులు, మహిళలు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ళ భరణి వాట్సప్‌ కాల్‌ ద్వారా వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రాముఖ్యత, అభివృద్ధిని ఆయన కొనియాడారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ కమిటీ సభ్యులకు, కెనడాలో నివసించే తెలంగాణ వాసులు, సంస్థ శ్రేయోభిలాషులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తనికెళ్ల భరణి.. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో జరిగిన ధూమ్ ధామ్ ఉత్సవాలకు శ్రీరంజని కందూరి, ప్రహళిక మ్యాకల వ్యాఖ్యాతలుగా ప్రేక్షకులను అలరించారు. ఈ సంబరాలలో కూచిపూడి నృత్యాలయం వారు ప్రదర్శించిన అదివో అల్లదివో, కృష్ణం వందే జగద్గురుం, గోవిందా అని కొలవరే, రామాయణ శబ్దంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

ఈసందర్భంగా టీసీఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. స్పాన్సర్‌ చేసినవారికి, నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీసీఏ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను లోకల్ టాలెంట్‌తో అత్యంత కలర్‌ఫుల్‌గా నిర్వహించడాన్ని ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్‌లను సైతం ప్రతీ వేడుకలో ప్రోత్సహిస్తోందన్నారు. ఇందులోభాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్‌ను ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేశారు. ఈ వేడుకల్లో టీసీఏ కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి , సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి రాజేష్ ఎర్ర, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు శంకర్ భరద్వాజ పోపూరి, నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, శ్రీరంజని కందూరి, భగీరథ దాస్ అర్గుల, ప్రవీణ్ కుమార్ సామల,  ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు ప్రసన్న మేకల, మురళీధర్ కందివనం, వ్యవస్థాపక కమిటీ ఛైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు కోటేశ్వర రావు చిత్తలూరి, హరి రావుల్, శ్రీనివాస తిరునగరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, అఖిలేష్ బెజ్జంకి, కలీముద్దీన్ మొహమ్మద్, రాజేశ్వర్ ఈద, వేణుగోపాల్ రోకండ్ల, విజయ్ కుమార్ తిరుమలపురం, ప్రభాకర్ కంబాలపల్లితో పాటు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని