Canada: ‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు

‘తెలుగు అలయన్స్‌ ఆఫ్‌ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్‌ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Published : 17 Apr 2024 00:58 IST

టొరంటో: ‘తెలుగు అలయన్స్‌ ఆఫ్‌ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్‌ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐదు గంటలపాటు నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 1500 మంది ప్రవాసీయులు పాల్గొన్నారు. ‘తాకా’ అధ్యక్షుడు రమేశ్ మునుకుంట్ల ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి సభికులను ఆహ్వానించారు. ధనలక్ష్మి మునుకుంట్ల, సాధన పన్నీరు, వాణి జయంతి, అనిత సజ్జ, సుకృతి బాసని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

క్రోధి నామ సంవత్సరంలో రాశి ఫలాలను పురోహితుడు మంజునాథ్‌ సభికులకు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా ‘తాకా’ 2024 ఉగాది పురస్కారాలను డాక్టర్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గరిస, ఒంటారియో మాజీ మంత్రి దీపిక దామెర్ల, కెనడాలో తెలుగు ప్రముఖుడు లక్ష్మీనారాయణ సూరపనేనికి అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ‘తాకా’ అధ్యక్షుడు రమేశ్ మునుకుంట్ల మాట్లాడుతూ.. తెలుగు కళలు, పండుగలు, భారతీయ సంసృతీ, సంప్రదాయాలను కెనడాలోని తెలుగు వారందరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. వీటిని ముందుతరాలకు అందజేయుటకు ‘తాకా’ చేస్తున్న కృషికి కెనడాలోని తెలుగువారందరూ సహకరించాలని కోరారు. తెలుగు జాతి కీర్తిని పెంచేందుకు తెలుగు వారందరినీ ఒకేవేదికపైకి తీసుకురావడం ముఖ్యం అన్నారు. ఈ విషయంలో ‘తాకా’కు సహకరిస్తున్న గ్రాండ్ స్పాన్సర్ శ్రీరాం జిన్నాల, గోల్డు స్పాన్సర్లు, సిల్వర్ స్పాన్సర్లకు రమేశ్ మునుకుంట్ల కృతజ్ఞతలు తెలిపారు.

ప్రముఖ చిత్రకారుడు డాక్టర్‌ కొండపల్లి శేషగిరిరావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ‘An Odyssey of Life and Art Dr.Kondapalli Seshagiri Rao’ పుస్తకాన్ని వారి బంధువులు విజయరామారావు, సుబ్బారావు ఆధ్వర్యంలో ఫౌండేషన్ కమిటీ ఛైర్మన్‌ అరుణ్ కుమార్ లాయం, అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల ఆవిష్కరించారు. డాక్టర్‌ కొండపల్లి శేషగిరిరావు గారి జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని వారు అన్నారు.   

ఈ ఉగాది ఉత్సవాలలో ‘తెలుగు అలయన్స్‌ ఆఫ్‌ కెనడా’ అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులు రాఘవ్ అల్లం, ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లిఖార్జునా చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరక్టర్లు కుమారి విద్య భవణం, ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, ఖజిల్ మొహమ్మద్, దుర్గా ఆదిత్య వర్మ భూపతిరాజు, సాయి బోధ్ కట్టా,  యూత్ డైరక్టరు లిఖిత యార్లగడ్డ, ఎక్స్ అఫీషియో సభ్యురాలు కల్పన మోటూరి, ఫౌండేషన్ కమిటీ ఛైర్మన్‌ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీబోర్డు ఛైర్మణ్ సురేశ్ కూన, ట్రస్టీలు శృతి ఏలూరి, వాణి జయంతి, పవన్ బాసని, ఫౌండర్లు హనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్ కుందూరి, మునాఫ్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అనిత సజ్జ, కుమారి విద్య భవణం, ఖజిల్ మొహమ్మద్, లిఖిత యార్లగడ్డ వ్యవహరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని