Sporty Divas: ఇండో-గల్ఫ్‌ త్రోబాల్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా అమెరికా జట్టు

బహ్రెయిన్‌లో నిర్వహించిన ‘ఇండో-గల్ఫ్‌ ఇంటర్నేషనల్‌ త్రోబాల్‌ ఛాంపియన్‌షిప్‌’లో అమెరికాకు చెందిన మహిళల జట్టు ‘స్పోర్టీ దివాస్‌’ విజేతగా నిలిచింది.

Published : 02 Mar 2024 19:46 IST

వాషింగ్టన్‌: ‘అంతర్జాతీయ త్రోబాల్‌ సమాఖ్య’ ఆధ్వర్యంలో బహ్రెయిన్‌లో నిర్వహించిన ‘ఇండో-గల్ఫ్‌ ఇంటర్నేషనల్‌ త్రోబాల్‌ ఛాంపియన్‌షిప్‌’లో అమెరికాకు చెందిన మహిళల జట్టు ‘స్పోర్టీ దివాస్‌ (Sporty Divas)’ విజేతగా నిలిచింది. ‘ది ఇండియన్‌ క్లబ్‌ బహ్రెయిన్‌’ భాగస్వామ్యంతో కలిసి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో బహ్రెయిన్‌ నుంచి నాలుగు, అమెరికా, భారత్‌, సౌదీ నుంచి ఒక్కో టీమ్‌ పోటీపడ్డాయి. సెమీఫైనల్‌లో సౌదీపై విజయం సాధించిన అమెరికా జట్టు.. ఫైనల్‌లో భారత్‌పై గెలుపొంది ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచింది.

తానా ఎన్నిక కథ సుఖాంతం.. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోదం

అమెరికా ‘స్పోర్టీ దివాస్‌’ జట్టులో వసంత కావూరి, కావ్య వుర్రాకుల, నిత్య సౌందరరాజన్‌, శబ్నం శంషుద్దీన్‌, సాయి లక్ష్మి గార్లపాటి, సృజన కుంచి, గౌతమి యలవర్తి ఉన్నారు. తానా సెక్రటరీ రాజా కసుకుర్తి, తానా స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి, తానా ఇంటర్నేషనల్‌ కోఆర్డినేటర్‌ ఠాగూర్‌ మల్లినేనిలు ఈ టీమ్‌కు స్పాన్సర్‌ చేశారు. తమను ప్రోత్సహించిన తానా నేతలకు, కుటుంబసభ్యులకు విజేత జట్టు ధన్యవాదాలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని