మ్యాజిక్ ఫిగర్‌ దాటేసిన ఎన్డీయే కూటమి

బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ

Updated : 10 Nov 2020 20:40 IST

 

పట్నా: బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 స్థానాలను ఎన్డీయే కూటమి సాధించింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్‌బంధన్ ‌(ఎంజీబీ)తో జరిగిన హోరాహోరీ పోరులో అంతిమంగా విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఎన్డీయే 123 స్థానాల్లో విజయం సాధించి ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఎంజీబీ 108 స్థానాల్లో గెలుపొంది 3 స్థానాల్లో ఆదిక్యంలో ఉంది. మరోవైపు ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించగా.. ఎల్జేపీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని