Bandi Sanjay: కాంగ్రెస్‌ నేతలు గాలిలో కోటలు నిర్మిస్తున్నారు: బండి సంజయ్‌

కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ట్రైలర్‌లోనే కనిపిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. 

Updated : 18 Jun 2023 18:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం మర్చిపోయి.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేతలు పగటి కలలు కంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ట్విటర్‌ వేదికగా విమర్శించారు. క్రైమ్‌, కరప్షన్‌ టీపీసీసీ కళంకిత రాజకీయ నాయకులు గాలిలో కోటలు నిర్మిస్తున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ట్రైలర్‌లోనే కనిపిస్తుందన్నారు. అక్కడ వారు హిందువులపై మతమార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. హెడ్గేవార్, సావర్కర్ చరిత్రలను పాఠ్యపుస్తకాలల్లో నుంచి తీసేసి ఒసామా బిన్‌ లాడెన్‌, కసబ్‌ లాంటి ఉగ్రవాదులపై చాప్టర్‌లు చెబుతారా అని ప్రశ్నించారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ బియ్యం పంపిణీ పథకం చాలా లోపభూయిష్టంగా ఉందన్నారు. తెలంగాణలో పింఛన్లు, ధరణి, సంక్షేమ పథకాలపై అనిశ్చితి ఏర్పడిందన్నారు. భారాస అధికారంలోకి రాకుంటే సంక్షేమ పథకాలు రావని కేసీఆర్‌ చెబుతూ ప్రజల్లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే సామాజిక భద్రతా పథకాలను కొనసాగిస్తామన్నారు. అన్ని లోపాలను సరిదిద్ది, రాజకీయ నాయకులు వారి కుటుంబాలకు కాకుండా ప్రజలకు మాత్రమే ఉపయోగపడేలా వాటిని మరింత మెరుగుపరుస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని