Chidambaram: వారికి చరిత్రపై అవగాహన లేదు..దానిని తిరగరాయాలని చూస్తున్నారు..!

మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కారణంగానే గోవా విముక్తి ఆలస్యమైందని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం ఖండించారు. ఈ వ్యాఖ్యలనీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నమన్నారు. గోవా విముక్తి కోసం నెహ్రూ సరైన సమయంలోనే జోక్యం చేసుకున్నారని తెలియజేశారు. 

Published : 11 Feb 2022 19:18 IST

పనాజీ: మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కారణంగానే గోవా విముక్తి ఆలస్యమైందని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం ఖండించారు. ఈ వ్యాఖ్యలనీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నమన్నారు. గోవా విముక్తి కోసం నెహ్రూ సరైన సమయంలోనే జోక్యం చేసుకున్నారని తెలియజేశారు.

‘మోదీ, అమిత్‌షాకు స్వాతంత్య్రానంతర చరిత్ర తెలీదు. ముఖ్యంగా 1947 నుంచి 1960 మధ్య విషయాలపై అవగాహన లేదు. జవహర్‌ లాల్ నెహ్రూ దేశాన్ని ఎంత నేర్పుగా నడిపారో వారికి తెలిసుండదు. ఆ సమయంలో భారత్ శాంతికాముక దేశంగా, అలీనోద్యమ కూటమికి పెద్దగా పేరుపొందింది.  గోవా విముక్తి విషయంలో నెహ్రూ సరైన సమయంలో జోక్యం చేసుకున్నారు. అందుకే మిలిటరీ చర్యకు వ్యతిరేకంగా ఒక్క గొంతుకూడా వినిపించలేదు. అలాగే భవిష్యత్తును నిర్ణయించేందుకు అభిప్రాయ సేకరణ(ఒపినీయన్‌ పోల్‌) నిర్వహించారు. అందుకే గోవా ఈనాడు స్వతంత్ర రాష్ట్రంగా ఉంది. మోదీ, అమిత్‌ షా ఏం చెప్పినా, చరిత్రను వక్రీకరించి తిరగరాయాలని చూసినా.. గోవా ప్రజలు నెహ్రూ వ్యవహరించిన తీరును ఎప్పటికీ గుర్తుంచుకుంటారు’ అని చిదంబరం భాజపా విమర్శలను తోసిపుచ్చారు. 

గురువారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. నెహ్రూ తలుచుకుంటే కొన్ని గంటల్లోనే గోవా స్వేచ్ఛాయుత ప్రాంతంగా ఉండేదన్నారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన 15 సంవత్సరాలకు అది పోర్చుగీసు పాలననుంచి బయటపడిందన్నారు. భాజపా అగ్రనేత అమిత్‌ షా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని