20 రోజులుగా నా భర్త కనిపించడంలేదు

పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్ గత 20 రోజలుగా కనిపించడంలేదని ఆయన భార్య కింజల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గుజరాత్ ప్రభుత్వం తన భర్తను కేసుల పేరుతో వేదిస్తుందని....

Published : 14 Feb 2020 14:48 IST

అహ్మదాబాద్‌: పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్ గత 20 రోజలుగా కనిపించడంలేదని ఆయన భార్య కింజల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తన భర్తను కేసుల పేరుతో వేధిస్తోందని  ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆమె ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నా భర్త 20 రోజులుగా కనిపించడంలేదు. ఆయన ఎక్కడున్నారనే దానిపై మాకు సమాచారం లేదు. ఇలా ఎంతకాలం ఆయన్ను మా నుంచి వేరు చేస్తారు. 2017లో పాటీదారులపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం హార్దిక్‌ పటేల్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? ప్రజలను కలుసుకొని వారి సమస్యలను ప్రస్తావించకుండా హార్దిక్‌ను ప్రభుత్వం అడ్డుకుంటోంది’’ అని వీడియోలో ఆమె ఆరోపించారు.

అయితే చివరగా ఈ నెల 11న హార్దిక్‌ దిల్లీ ఎన్నికల్లో గెలిచిన అరవింద్‌ కేజ్రివాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 10న ట్విటర్‌ వేదికగా ఆయన గుజరాత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘నాలుగు సంవత్సరాల క్రితం గుజరాత్ పోలీసులు నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. దాని గురించి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అహ్మదాబాద్ పోలీస్‌ కమిషనర్‌ను కేసు వివరాలు గురించి అడగ్గా, నాపై కేసు లేదని చెప్పారు. కానీ 15 రోజుల క్రితం నన్ను అదుపులోకి తీసుకొనేందుకు నా ఇంటికి పోలీసులు వచ్చారు. ఆ సమయంలో నేను ఇంట్లో లేను’’ అని ట్వీట్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని