నేడే సింధియా భాజపాలో చేరిక..?

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌తో పనిచేసిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి గుడ్‌బై చెప్పడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సింధియాకు మద్దతుగా ఆయన వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Updated : 11 Mar 2020 12:53 IST

భోపాల్‌: సుదీర్ఘకాలం కాంగ్రెస్‌తో పనిచేసిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి గుడ్‌బై చెప్పడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సింధియాకు మద్దతుగా ఆయన వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ సర్కార్‌ సంక్షోభంలో పడింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సింధియా.. నేడు భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

నిజానికి ఈ నెల 12న ఆయన కాషాయ పార్టీలో చేరుతారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే బుధవారమే ఆయన చేరిక ఉంటుందని తాజాగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బుధవారం మధ్యాహ్నం దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సింధియా కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 

మోదీ.. షా భేటీ..

మరోవైపు ఈ ఉదయం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. మధ్యప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులు, సింధియా పార్టీలో చేరిక గురించి వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. భాజపాలో చేరిన తర్వాత సింధియాను రాజ్యసభకు నామినేట్‌ చేయడంతో పాటు కేంద్రమంత్రిని చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని