అన్నవరం కొండపై క్వారంటైన్‌ కేంద్రమా?:కన్నా

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కొండపై క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 20 Apr 2020 00:27 IST

సీఎస్‌కు లేఖ రాసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

గుంటూరు: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కొండపై క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. హరిహరసదన్‌లో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు అక్కడి అధికారులు ప్రయత్నాలు చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్నికి కన్నా లేఖ రాశారు. అన్నవరం కొండ ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసని.. అక్కడ నిర్మించిన సత్రాలన్నీ దాతలు, భక్తుల సహకారంతో చేపట్టినవేనని చెప్పారు. అన్నవరం చుట్టుపక్కల స్థలం లేనట్లుగా కొండపై క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలనుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. హిందువుల నమ్మకాన్ని కించపరచాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇదంతా చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కలుగజేసుకోవాలని సీఎస్‌ను కన్నా కోరారు. హిందూ దేవాలయాలకు చెందిన సత్రాల్లో క్వారంటైన్‌ కేంద్రాలు, ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయకుండా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి..

గ్రామ వాలంటీర్లు,ఆశావర్కర్లకు ‘కరోనా’ బీమా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని