ప్రజల కోసం మరిన్ని ఉద్యమాలు :కోదండరాం

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ జనసమితి ఉద్యమిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెజస రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను

Published : 29 Apr 2020 14:01 IST

హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ జనసమితి ఉద్యమిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెజస రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భవించిన రెండేళ్ల కాలంలో ప్రజల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో నిరుద్యోగం, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల సమస్యలపై ఉద్యమిస్తూ పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని మండిపడ్డారు. తాలు పేరుతో కోత విధించడం సరి కాదన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. పలువురు తెజసా  నాయకులు సామాజికదూరం పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని