ఎన్నికల వ్యూహాల ఖరారులో భాజపా

భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన బుధవారం దిల్లీలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు.

Published : 13 Jul 2023 06:07 IST

జె.పి.నడ్డా అధ్యక్షతన దిల్లీలో భేటీ

దిల్లీ: భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన బుధవారం దిల్లీలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో నిర్వహించే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయావకాశాలను మెరుగుపరచుకోవడంపై చర్చించుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఎదుర్కొన్న 160 నియోజకవర్గాల్లోనూ గెలవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 303 లోక్‌సభ స్థానాల్లో విజయపతాకం ఎగురవేసింది. ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో బయటపడిన స్థానాలు, పాత మిత్రులకు కేటాయించిన స్థానాల్లోనూ ఈ సారి భారీ ఆధిక్యం సాధించే దిశగా కమలదళ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మరింత అప్రమత్తమైన ఆ పార్టీ నాయకత్వం త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని