డ్రైవర్‌ నుంచి ఎమ్మెల్సీ అయ్యాను.. మజ్లిస్‌ ఎమ్మెల్సీ బేగ్‌ భావోద్వేగం

శాసనఞమండలి సమావేశాల్లో గురువారం వర్షాలపై నిర్వహించిన చర్చలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 04 Aug 2023 09:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: శాసన మండలి సమావేశాల్లో గురువారం వర్షాలపై నిర్వహించిన చర్చలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నేను కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీని. మొదటిసారి మాట్లాడుతున్నా. చాలా చిన్నవాణ్ని. డ్రైవర్‌గా పనిచేసేవాడిని. దీన్ని ఒప్పుకోవడం పెద్ద విషయమేమీ కాదు. అల్లా నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేనేదో పెద్దవాడిని అయ్యానని భావించను. ప్రజల మనిషిని. వారితో కలిసి ఉంటాను. ప్రాణాలున్నంతవరకు వారికి సేవ చేస్తాను. పాతబస్తీలో వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి. విద్యుత్తు సిబ్బంది సంఖ్యను పెంచాలి’’ అని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని