సందేశ్‌ఖాలీ నిందితుడిపై చర్యలు తీసుకున్నాం: మమత

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, అవినీతికి పాల్పడిన వారు జైలులో శేష జీవితం గడపడం తప్పదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు.

Published : 06 Apr 2024 06:27 IST

జల్పాయ్‌గుడీ: పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, అవినీతికి పాల్పడిన వారు జైలులో శేష జీవితం గడపడం తప్పదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. సందేశ్‌ఖాలీ దోషులపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని స్పష్టంచేశారు. శుక్రవారం జల్పాయ్‌గుడీలో మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మహిళా రెజ్లర్లను భాజపా ఎంపీ వేధించినప్పుడు, హాథరస్‌ ఘటనలో వారు మూగ ప్రేక్షకులుగా ఉన్నారు. నేను వారిలా (భాజపా) కాదు. సందేశ్‌ఖాలీ అంశం నా దృష్టికి వచ్చిన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నాను’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని