ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

రాష్ట్రంలో రోడ్లు బాగోలేవు.. నిరుద్యోగ సమస్య పెరిగింది.. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ ధ్వజమెత్తారు. వీటిపై ప్రశ్నిస్తుంటే దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.

Published : 08 Apr 2024 05:36 IST

భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో రోడ్లు బాగోలేవు.. నిరుద్యోగ సమస్య పెరిగింది.. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ ధ్వజమెత్తారు. వీటిపై ప్రశ్నిస్తుంటే దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. కొందరు అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు. విజయవాడలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులదే. జగన్‌ తన సొంత జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు 13 కంపెనీల పోలీసు బలగాలను మోహరించారు. అదే చిలకలూరిపేటలో ఎన్డీయే సభకు ప్రధాని మోదీ వస్తే అయిదు కంపెనీలను మాత్రమే పంపారు. మీకు ప్రజల అండ ఉంటే ఎందుకంత భయపడుతున్నారు?’ అని జగన్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైకాపావారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని